స్పాట్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్‌గా బానోతు వీర ప్రతాప్ నియామకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ఆదివారం స్పాట్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభలో ఫౌండర్ అండ్ చైర్మన్ బాదావత్ వీరన్న, బానోతు వీర ప్రతాప్‌ను తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్‌గా నియమించి నియామక పత్రాన్ని అందించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వీర ప్రతాప్, సంస్థ పట్ల నిబద్ధతతో పనిచేస్తానని, ప్రజల హక్కుల కోసం, అవినీతి రహిత సమాజం కోసం కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕