చర్ల బీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మండల అధ్యక్షుడు కొండ చరణ్ మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజల ఓట్లు అడిగే హక్కు ఇసుమంత కూడా లేదన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ ప్రాంతంలోని ఏ సమస్యలు పరిష్కరించలేదని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం చేయకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు.