భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మండలం జూలూరుపాడులో వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇంద్రపల్లి హరిణి హత్యను నిరసిస్తూ గ్రామస్తులు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో హరిణి చిత్రపటానికి నివాళులర్పించి, నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, హరిణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.