భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని జగన్నాధపురం పెద్దమ్మతల్లి గుడిలో శనివారం చండీ హోమం పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత, 14 మంది దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మేళ తాళాలు, వేదమంత్రాలతో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను యాగశాలకు తీసుకువచ్చి, మండపారాధన, గణపతి పూజలు నిర్వహించి, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆలయ ఈవో విజయకుమార్ ఈ వివరాలను వెల్లడించారు.