తూకాల్లో అక్రమాలకు చెక్.. మార్కెట్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం, న్యూ పాల్వంచలోని రాజీవ్ గాంధీ మార్కెట్‌లో ఆదివారం తూనికలు కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చికెన్, చేపల దుకాణాల్లో తూకం యంత్రాలను పరిశీలించగా  సరైన తూకం పాటించని కొందరు వ్యాపారులను గుర్తించి వారికి జరిమానా విధించారు. ఈ చర్యతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. నెలకు కనీసం రెండుసార్లు ఇలాంటి తనిఖీలు నిర్వహించాలని కస్టమర్లు అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕