విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై కలెక్టర్ ఆరా

కొత్తగూడెంలోని మేదరబస్తీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పూర్తయిన సిలబస్, చదివే సామర్థ్యాన్ని పరిశీలించారు. గతేడాది 86 శాతం ఉత్తీర్ణత నమోదైన నేపథ్యంలో ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను కూడా తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕