భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఈఓకు సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ వినతి పత్రం అందజేశారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ చైతన్య స్కూల్ అధిక ఫీజులు వసూలు చేయడం, అక్రమంగా పుస్తకాలు అమ్మడం, ఆర్టీఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. షెడ్యూల్ ఏజెన్సీ 1/70 యాక్టు పరిధిలో, భూ బద్దలైంపు చట్టం 1/59, 1/70 ACT, PESA -1996 గ్రామసభ తీర్మానం, పంచాయతీరాజ్ చట్టం 2018 లను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరారు.