భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ రూరల్ మండలం దంతలబోర గ్రామంలో శుక్రవారం భారీ వర్షాల కారణంగా రేకులతో నిర్మించిన ఇళ్లు కొట్టుకుపోవడం, కరెంట్ స్తంభాలు పడిపోవడాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగిరెడ్డి భువన సుందర్ రెడ్డి పరిశీలించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలని తహశీల్దార్ ను కోరారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జిల్లా సెల్ అధ్యక్షులు, గ్రామస్తులు పాల్గొన్నారు.