భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని భద్రాద్రి కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఎస్‌ఐఆర్ ఓటర్ల అబ్జర్వర్ నాగసీతారాములు, కంచర్ల చంద్రశేఖర్, ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, కొత్వాల శ్రీనివాసరావు, నూకల రంగారావు, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ద్వారా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు.