తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు (కేకే), తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె. అహ్మద్ సోమవారం హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి కి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.