భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జరిగిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ పేద జర్నలిస్టుల కుటుంబాలకు ఇంటి స్థలాలు, ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు, ఇన్సూరెన్స్ వంటి సమస్యలను రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, జర్నలిస్టులకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.