భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో 52వ డివిజన్లో బంజారా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి, మాజీ వార్డు కౌన్సిలర్ మాచర్ల శ్రీనివాస్ ఆదివారం సందర్శించారు. ఆయన వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి పూజించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ డివిజన్ కార్యదర్శి బానోతు ధనరాజ్, సహాయ కార్యదర్శి అజయ్ యాదవ్, సీపీఐ డివిజన్ ఏరియా కార్యదర్శి సురేష్, సీపీఐ నాయకులు జానీ, హైమద్, కాంగ్రెస్ నాయకులు అజ్మీర్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు.