ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి భక్తులు కాలినడకన పాదయాత్రగా వెళ్లడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో, పెనుబల్లి మండలం ఎడ్ల బంజర చింతల రామ ముత్యం గ్రామం నుంచి ఆరుగురు సభ్యుల బృందం సుమారు 100 కిలోమీటర్లు పాదయాత్రగా భద్రాచలం రామయ్య దర్శనానికి బయలుదేరింది. ఆదివారం వారు కొత్తగూడెం చేరుకున్నారు.