కిన్నెరసాని వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్లో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ నేరాల నియంత్రణపై పాల్వంచలో జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్యప్రాణుల ఆవాసాలు, సంచార ప్రాంతాలు, నీటి వనరులు, సున్నిత ప్రాంతాలు, అక్రమ వేట నియంత్రణ, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ అంశాలను సమీక్షించారు. అటవీ ప్రాంతాల్లో ఫీల్డ్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు.