సెప్టెంబర్ 28 సోమవారం నాడు భద్రాద్రి కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ IAS తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం, అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి ఉంటుందని చెప్పారు.