భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట వద్ద బుధవారం రాత్రి వంతెన కూలిపోయిన ఘటనపై అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందించారు. కూలిపోయిన వంతెనను స్వయంగా పరిశీలించి తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉన్నత అధికారులకు తెలియజేశారు.