రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ ప్రయాణించిన హెలికాప్టర్ ఇంధనం లేకపోవడం వల్ల బుధవారం ఆదిలాబాద్‌లోనే నిలిచిపోయింది. ఆయన రోడ్డుమార్గంలో కార్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించడానికి మంత్రి మంగళవారం హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నారు. బుధవారం తిరిగి హైదరాబాద్ వచ్చే సమయంలో హెలికాప్టర్లో తగినంత ఇంధనం లేదని సిబ్బంది గుర్తించారు. ఇంధనం రీఫిలింగ్ కోసం నాందేడ్ నుండి తెప్పించాల్సి ఉంది.