కేశవాపురంలో కేపీహనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం కేశవాపురం గ్రామంలో కె. పి. హనుమాన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతినవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మంగళవారం గణేషుని అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విఘ్నేశ్వరుడికి చేసే పూజలు ఎంతో పవిత్రమైనవని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతా నాగరాజు, గంధం రామయ్య, అజ్మీరా రమేష్, గంధం నరసింహారావు, గంధం సతీష్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕