భద్రాచలం గోదావరి ఉగ్రరూపం.. 41 అడుగులకు చేరిన నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 10 గంటలకు నీటిమట్టం 41.00 అడుగులకు చేరింది. ప్రస్తుతం 8,47,533 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕