ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కలెక్టరేట్ ముట్టడికి జేఏసీ పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీల హక్కులు, భూములు, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ అక్టోబర్ 5న జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం చర్లలో కరపత్రాలు విడుదల చేశారు. 1/70 చట్టంపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్‌ దాఖలు చేయాలని, ఏజెన్సీలో చట్టాల అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕