జూలూరుపాడు: హత్య కేసులో నిందితుల రిమాండ్

చేతబడి అనుమానంతో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. రాచబండ్లకోయగూడేనికి చెందిన కుంజా ప్రవీణ్, అతడికి వరసకు మామ అయిన మల్కం గంగులు కలిసి అదే గ్రామానికి చెందిన కుంజా భిక్షం (42)ను చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో హత్య చేశారు. భిక్షాన్ని వెంటబెట్టుకుని సమీపంలోని వేపలవాగు వద్దకు వెళ్లారు. అక్కడ మద్యం తాగి రాయితో కొట్టి భిక్షాన్ని హత్య చేశారని సీఐ వెల్లడించారు

సంబంధిత పోస్ట్