జూలూరుపాడు మండలం పాపకొల్లు సాయి ఎక్స్‌లెంట్ పాఠశాల విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్ శనివారం అభినందించారు. అనంతరం MEO మాట్లాడుతూ. పాఠశాలకు చెందిన భరత్ కార్తికేయ, విశ్వ సన్నిద్, యశ్వంత్ ముగ్గురు విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షలో సీట్లు సాధించినందుకు గాను అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.