భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం పాల్వంచ 44వ డివిజన్ గాంధీనగర్ నివాసి కటుకూరి ఆనందం 98వ జయంతి వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మనవడు కటుకూరి శేఖర్ బాబు మాట్లాడుతూ తన తాతయ్య గొప్ప సువిశాల హృదయుడని, ఆయన చెప్పిన మాటలు, చూపిన బాట ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నామని, ఆయన స్మృతులను నెమరువేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వేడుకల్లో కటుకూరి వెంకటేశ్వర్లు కుమారుడు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.