కొత్తగూడెం: 58 మంది బాలకార్మికులకు విముక్తి: ఎస్పీ

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్-XII లో భాగంగా, జనవరి 1 నుండి జనవరి 31, 2026 వరకు జిల్లా వ్యాప్తంగా 5 ప్రత్యేక బృందాలు వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాలలో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 58 మంది బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా బాల కార్మికుల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది.

సంబంధిత పోస్ట్