విద్యుత్ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో భద్రాద్రి జిల్లాలో విద్యుత్ మొండి బకాయిలు పెరిగిపోతున్నాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాల బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడం వల్ల తలకు మించిన భారంగా మారుతోంది. విద్యుత్ బిల్లుల భారం నుంచి బయటపడేందుకు ఆ శాఖ బ్యాంకు రుణాల వైపు చూస్తోంది. పెండింగ్ బిల్లుల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి.