రాష్ట్రంలోని 16 జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి అప్రమత్తతతో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయంతో అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి పాల్గొన్నారు.