కొత్తగూడెం: బాండ్ పేపర్ తో ప్రచారం

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో 56వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఈసంపల్లి మౌనిక, గురువారం 9 హామీలతో కూడిన బాండ్ పేపర్‌ను ప్రజల ముందు ఉంచి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆమె ఇచ్చిన హామీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గ్రంథాలయం, సీసీ రోడ్లు, ఎస్ఈడి దీపాలు, సీసీ కెమెరాలు, ఉచిత వైఫై, అభివృద్ధి, ఉపాధి, బ్యాంకు రుణాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత శిక్షణ వంటివి ఉన్నాయి. ఈ వినూత్న ప్రచారంతో ఆమె ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్