కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం ఉదయం 24వ డివిజన్ బర్మా క్యాంపు చమన్ బస్తి సిపిఐ పార్టీ అభ్యర్థి పొలమూరి ధనలక్ష్మి భారీ జనసందోహంతో నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజున జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాశి వెంకన్న, కొత్తగూడెం కార్పొరేట్ బ్రాంచ్ సెక్రటరీ రమణ మూర్తి, ఎఐటియుసి నాయకులు కిష్టఫర్, 24వ డివిజన్ కార్యదర్శి జక్కుల గడ్డయ్య, ఉపసర్పంచ్ పొలమూరి శ్రీనివాస్ తో పాటు పలువురు సిపిఐ నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.