కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో కోతులు, కుక్కల బెడద తీవ్రమైంది. శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ధర్నా చేపట్టారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కేటాయించిన నిధుల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇళ్ల ముందు నిలబడలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.