కొత్తగూడెం: హెచ్ఐవీపై అవగాహన కల్పించండి

తల్లిపాల నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎయిడ్స్ సంస్థ జాయింట్ డైరెక్టర్ డా. రాజ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ మహిళా సాధికారత, తదితర అంశాలపై కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎలాంటి సమయంలో హెచ్ఐవీ సోకుతుందో తెలియజేయాలన్నారు. అనంతరం షీ టీమ్ ఇన్స్పెక్టర్ రమాదేవి ఉమెన్ ట్రాఫికింగ్పై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్