2026 ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం నేపథ్యంలో, ఓటరు వివరాల సేకరణ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌తో ఆయన సమీక్షించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకు ఫారం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.