కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలను వెంటనే అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి మాట్లాడారు. దశాబ్ద కాలంగా నత్తనడకన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం సాగుతున్నాయని, వెంటనే నిర్మాణాన్ని వేగవంతం చేసి పేదలకు ఇవ్వాలని కోరారు. పేదలపట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.