డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం అనంతరం మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు. మెరుగైన విద్యను, ప్రపంచ ఖనిజ సంపదపై పరిశోధనలు జరగాలని ఈ ప్రాంతంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలోని ఖనిజాలను గుర్తించి, సింగరేణి లాంటి సంస్థలను పెంపొందించేందుకు ఎర్త్ యూనివర్సిటీ దోహదపడుతుందని ఆయన తెలిపారు.