కొత్తగూడెం జిల్లా, పాత కొత్తగూడెం లో ఆదివారం ఉదయం కార్పొరేటర్ ఆకాంక్ష పడాల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో 11వ డివిజన్ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు, ఇతర ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించబడ్డాయి. వైద్యుల సలహాలు, ఆరోగ్య సూచనలు కూడా అందించారు. తెలంగాణ స్కూల్ పక్కానా పార్క్ లో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ ఆకాంక్ష పడాల కోరారు.