దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృత్రిమ కొరతను సృష్టించి ధరలను పెంచుతున్నాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు ఆరోపించారు. మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ, సంస్థలకు లాభం చేకూర్చేందుకే మోదీ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.