భద్రాచలంలో శనివారం సాయంత్రం 5:30 గంటల నుండి గోదావరి నది హారతి కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం తెలిపారు. దేశంలో నదులు ప్రజల జీవనానికి ఆధారమని, నాగరికత అభివృద్ధికి మూలాధారమని, తరతరాలుగా ప్రజల జీవన విధానం, సంస్కృతి, పర్యావరణంతో ముడిపడి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని ఆయన అన్నారు.