మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారి జేఎంఎస్ స్వర్ణలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం, షీబాక్సు పోర్టల్ (http://she-box.wcd.gov.in) లో ఐసీసీ వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ పోర్టల్లో వివరాలు నమోదు చేయని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.