కొత్తగూడెం: రూ. 3.32 కోట్ల విలువైన గంజాయి దహనం

కొత్తగూడెం నియోజకవర్గంలోని తల్లేడ మండలం గోపాలపేటలో సోమవారం అధికారులు 664 కేజీల గంజాయిని దహనం చేశారు. ఇందులో కొత్తగూడెం జిల్లాకు చెందిన 482 కేజీలు, ఖమ్మం జిల్లాకు చెందిన 182 కేజీలు ఉన్నాయి. వీటి విలువ రూ.3.32 కోట్లు ఉంటుందని అంచనా. డీసీ జనార్థన్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు ఈ చర్య చేపట్టారు.

సంబంధిత పోస్ట్