జిల్లాలో తాగు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి నీరు విడుదల చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ బుధవారం తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా వాసులకు తాగు నీటికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణతో మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు.