సింగరేణిలో గత ఏడాది నుంచి నిలిచిపోయిన మెడికల్ బోర్డును పాత విధానంలోనే నిర్వహించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, జీఎం శాలేంరాజుతో పాటు పీవీకే-5 గని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న సుమారు 2 వేల మంది కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరారు.