భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిల్లా ఇరిగేషన్, వ్యవసాయ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వైరా ఎం. ఎల్. ఏ రాందాస్ నాయక్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.