ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు ఒక్కపూట బడులు అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయు జిల్లా అధ్యక్షుడు కే. బ్రహ్మచారి, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి జి. పద్మ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ డీడబ్ల్యూఓ అధికారికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు, అంగన్వాడీ సభ్యులు పాల్గొన్నారు.