అక్టోబరు నెలలో వర్షాలు, మొంథా తుఫాను ధాటికి సింగరేణి బొగ్గు ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింది. కేవలం 55 శాతం ఉత్పత్తి మాత్రమే నమోదైంది, ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యల్పం. ఆగస్టులో 81%, సెప్టెంబరులో 70% ఉత్పత్తి నమోదైంది. గురువారం నాటికి అక్టోబరులో 4,06,464 టన్నులకు గాను కేవలం 223,809 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు. బెల్లంపల్లి ఏరియా మినహా మిగిలినవన్నీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఉపరితల గనుల ద్వారా లభించే బొగ్గు ఉత్పత్తిపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. వార్షిక లక్ష్యాన్ని చేరుకోవడానికి మిగిలిన నెలల్లో రోజుకు 25 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.