పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ‘విత్తనాల సేకరణ’ అనే వినూత్న పథకాన్ని ప్రారంభించారు. ఇందులో కొత్తగూడెం మండలంలోని రామవరం పాఠశాల ప్రథమ స్థానం దక్కించుకుంది. 10వ తరగతి విద్యార్థి సంతోష్ కుమార్ 30 రకాల విత్తనాలు సేకరించగా, ఎమ్మీవో డాక్టర్ ప్రభు దయాల్ అభినందించి బహుమతులు అందించారు.