కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫులే జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు. రామకృష్ణాపురం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా టీచర్ పూర్ణ, సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శారద, తదితర మహిళా టీచర్లను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి వసంత్ పాటిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, బార్ కౌన్సిల్ సభ్యులు సన్మానించారు.