కొత్తగూడెం: రేపటి నుంచి బాలల సంరక్షణకు ప్రత్యేక టీం

ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, గత 12 ఏళ్లుగా 'ఆపరేషన్ స్మైల్' కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా తప్పిపోయిన పిల్లలు, భిక్షాటనలో ఉన్నవారు, నిరాదరణకు గురైన బాలలు, బాల కార్మికులను పోలీసులు సంరక్షిస్తున్నారు. బాధిత పిల్లలను రక్షించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల జులై 1 నుంచి 31 వరకు జిల్లా పరిధిలో ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్