కొత్తగూడెం: పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర బృందం

జిల్లాలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో హౌస్-టు-హౌస్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక అధికారి బ్రహ్మానందరావు సోమవారం విస్తృతంగా పరిశీలించారు. పట్టణంలోని సఫాయి బస్తీ, బొల్లొరిగూడెం, బస్ స్టాండ్, అల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గుత్తికోయ గిరిజన ఆవాసం ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఐదేళ్లలోపు పిల్లలకు టీకాలు వేశారా లేదా అని తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్