జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ద కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ, విద్యార్థులు ఇప్పటి నుంచే శాస్త్రవేత్తలుగా ఎదగడానికి కృషి చేయాలని సూచించారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, సాంకేతికత ఆధారంగా సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోహన్ అకాడమీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.