కొత్తగూడెంలో శనివారం నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభల్లో 93 మంది సభ్యులు, 29 మంది ఆఫీస్ బేరర్లతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. పోతినేని సుదర్శన్రావు రాష్ట్ర అధ్యక్షుడిగా, తీగల సాగర్ కార్యదర్శిగా, జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ ఆరిబండి ప్రసాదరావు, పి. జంగారెడ్డి, నంద్యాల నర్సింహా రెడ్డి తదితరులు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.