కొత్తగూడెం: మహనీయుల ఆశయాలే సామాజిక న్యాయానికి మార్గదర్శకాలు

తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ, మహనీయులు ప్రతిపాదించిన ఆశయాలు, సిద్ధాంతాలే సామాజిక న్యాయం సాధించేందుకు మార్గదర్శకాలని అన్నారు. జాతిపిత మహాత్మ గాంధీ, డా బి. ఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు ఫూలే చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్